Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు.. వైకాపా నేతకు మూడేళ్ల జైలు

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:40 IST)
ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఉప ఎన్నికల ఫలితాల సమయంలో వైకాపా కార్యాలయం వద్ద లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ హెచ్‌.ఏ.రహమాన్‌కు కోర్టు మూడేళ్ల ఒక నెలపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2012 జూన్ 15న జూబ్లీహిల్స్‌లో రోడ్డు నంబర్ 45లో వైకాపా కార్యాలయం వద్ద ఉపఎన్నికల ఫలితాల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 
 
18 అసెంబ్లీ సీట్లలో 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని పార్టీ ముందంజలో ఉండటంతో నాయకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో రహమాన్ తన రివాల్వర్‌తో గాలిలోకి 5 రౌండ్లు కాల్చాడు. అప్పుడు విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్‌ ఎస్సై కే. సైదులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్‌ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించారు. 
 
ఛార్జిషీటు దాఖలు చేశారు. నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయమూర్తి జస్టిస్‌  శ్రీనివాసరావు మంగళవారం తీర్పునిచ్చారు. రహమాన్‌కు మూడేళ్ల ఒక నెల జైలు శిక్ష, 5 వేల అపరాధ రుసుము విధించి శిక్ష అమలు చేసారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments