Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాష గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ?

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (11:16 IST)
తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేద‌ని, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్టాడుతూ, తెలుగు గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ అని ఎద్దేవా చేశారు.

తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే ,వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

గ‌తంలో చంద్రబాబు సీఎంగా ఉన్న‌పుడు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ వైసీపీ ప్ర‌భుత్వం రాగానే, సీఎం జ‌గ‌న్ పంచ‌న చేరారు. ఆయ‌న‌ను భాషా సంఘం అధ్య‌క్ష ప‌దవి నుంచి తొల‌గిస్తార‌నే, ఊహాగానాలు కూడా అప్ప‌ట్లో వెలువ‌డ్డాయి.

కానీ, వైసీసీ అండ‌దండ‌ల‌తో యార్ల‌గ‌డ్డ కొన‌సాగుతూ వ‌చ్చారు. ఇపుడు తాజాగా ఇంగ్లిష్ మీడియం, తెలుగు, సంస్కృత అకాడ‌మీల అంశం తెర‌పైకి రావ‌డంతో... వైసీపీ త‌ర‌ఫున చంద్ర‌బాబు కౌంట‌ర్లు ఇవ్వ‌డానికి తొలిసారి యార్ల‌గ‌డ్డ మీడియా ముందుకు వ‌చ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments