Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేడం.. నీవైతే బానే ఊప్తున్నావ్ గానీ ఈడైతే ఊప్తలేవ్... మంత్రి ఎర్రబెల్లి డబుల్ మీనింగ్ కామెంట్స్ (Video)

Advertiesment
మేడం.. నీవైతే బానే ఊప్తున్నావ్ గానీ ఈడైతే ఊప్తలేవ్... మంత్రి ఎర్రబెల్లి డబుల్ మీనింగ్ కామెంట్స్ (Video)
, శనివారం, 10 జులై 2021 (09:49 IST)
తెలంగాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళా ఎంపీడీవోను పల్లెప్రగతి గ్రామ సభలో అందరిముందు అవమానపరిచేలా డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు కలకలం సృష్టిస్తున్నాయి. 
 
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభలో మంత్రి ఎర్రబెల్లితో పాటు.. ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓను ఉద్దేశిస్తూ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, 'ఎంపీడీవో మేడం... మీరైతే బాగానే ఊప్తున్నారుగానీ ఈడైతే ఊపడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పక్కనే ఉన్న ఇతర అధికారులంతా ఫక్కున నవ్వాలు. 
 
మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలతో ఎంపీడీవో షాక్ తిన్నారు. మంత్రి వెనకాలే ఉన్న ఆమె.. మంత్రి కామెంట్స్ విని అలాగే నిలబడిపోయారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దూమారం లేపుతున్నాయి. రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఓ మహిళా అధికారిపై ఇలా అనుచిత కామెంట్స్ చేయడం తగునా అని ప్రశ్నిస్తున్నారు.
 
సీఎం కేసీఆర్‌కి మహిళలపై గౌరవం వుంటే మంత్రి ఎర్రబెల్లిపై లైంగిక వేధింపుల కేసు పెట్టి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. సెక్షన్ 354ఏ, 509 ప్రకారం ఎర్రబెల్లి వ్యాఖ్యలు లైంగిక వేధింపులకు సంబధించిన కేసు కిందకు వస్తాయన్నారు. ఒక మహిళా, గ్రూప్ వన్ ఆఫీసర్ పట్ల ఇంత అనుచిత వ్యాఖ్యలు సభ్యత సంస్కారం లేకుండా చేశారంటే సాదారణ మహిళల పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు డీఎస్సీ-2008 క్వాలిఫై అభ్యర్థులకు కౌన్సెలింగ్