Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా అందంగా ఉన్నావ్.. పర్సనల్‌గా వచ్చి కలవరాదూ... : మహిళా కార్పొరేటర్‌‌తో టీడీపీ నేత

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్‌‌ పట్ల సాక్షాత్ ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వేధింపులకు పాల్పడినట్టు ప్రచారం సాగుతోంది. ఈ వివాదం పెద్దది కావడంతో పార్టీ ఎంపీ, ఇతర సీనియర్ నేతలు

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (14:45 IST)
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్‌‌ పట్ల సాక్షాత్ ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వేధింపులకు పాల్పడినట్టు ప్రచారం సాగుతోంది. ఈ వివాదం పెద్దది కావడంతో పార్టీ ఎంపీ, ఇతర సీనియర్ నేతలు జోక్యం చేసుకుని బాధితురాలితో పాటు ఆమె భర్తను కూడా బుజ్జగించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ ఒకటో పట్టణానికి చెందిన ఓ టీడీపీ మహిళా కార్పొరేటర్‌ తన డివిజన్‌ సమస్యల గురించి ఆ పార్టీ సీనియర్‌ నేతకు చెప్పింది. తన వద్దకు పర్సనల్‌గా వచ్చి చర్చించాలని సూచించాడు. దీంతో ఆయన వద్దకు వెళ్లిన ఆమెను అసభ్య పదజాలంతో సంభోదిస్తూ.. చాలా అందంగా ఉన్నావంటూ వెకిలి చేష్టలకు పాల్పడినట్టు వినికిడి. పైకి ఎంతో హుందాగా కనపడే ఆ నాయకుడు ఇలా వ్యవహరించడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో అక్కడ నుంచి బయటకు వచ్చి జరిగిన విషయం సన్నిహితులకు చెప్పింది. దీంతో వారంతా నివ్వెరపోయారు. 
 
ఈ అసభ్య ప్రవర్తన విషయం తెలుసుకున్న ఆమె భర్త మరి కొంతమంది కార్యకర్తలు ఆ నాయకుడిని చొక్కా పట్టుకుని నాలుగు తగిలించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ విషయం ఎంపీ కార్యాలయానికి చేరడంతో కార్యాలయ ప్రతినిధులు ఆ మహిళా ప్రతినిధి, ఆమె భర్తను పిలిపించి బుజ్జగించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సర్ధి చెప్పారు. పార్టీ పరువు రోడ్డున పడుతుందని, ప్రజల్లో చులకనైపోతుందంటూ అర్బన్‌ పార్టీ నేతలు కొందరు బతిమలాడటంతో వివాదాన్ని ముగించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments