Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 1 May 2025
webdunia

కోరిక తీర్చలేదంటే.. క్రీడా జీవితానికి ముగింపేనట... "సాయ్‌"లో కామాంధులు

సాయ్.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్.ఏ.ఐ) కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తోంది. దీని పరిధిలో మూడు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందే క్రీడాకారిణులపై లైంగిక వేధ

Advertiesment
Sports Authority
, బుధవారం, 6 జూన్ 2018 (09:11 IST)
సాయ్.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్.ఏ.ఐ) కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తోంది. దీని పరిధిలో మూడు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందే క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇదే అంశంపై పలువురు మహిళా క్రీడాకారులు సాయ్‌కు లిఖిత రూపంలో ఫిర్యాదు చేశారు.


కోచ్‌ల కోరిక తీర్చలేదంటే క్రీడా జీవితం ముగిసిపోతుందని వాపోయారు. ఈ మేరకు కోచ్‌లు తమను బెదిరిస్తూ తమతో శారీరకసుఖం పొందుతున్నారంటూ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సాయ్.. విచారణ జరిపి లైంగిక వేధింపులకు పాల్పడే కోచ్‌లపై వేటువేసింది. ఆ కోచ్‌ను తక్షణం రిటైర్మెంట్ తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 
 
ముఖ్యంగా, తమిళనాడు సాయ్ కేంద్రంలోని 15 మంది క్రీడాకారిణులు సాయ్ ప్రధాన కార్యాలయానికి లేఖ రాస్తూ తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మొరపెట్టుకున్నారు. తన కోరిక తీర్చకుంటే క్రీడా జీవితం ముగిసిపోతుందని కోచ్ తమను హెచ్చరించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు రహస్యంగా దర్యాప్తు ప్రారంభించారు. 15 మంది జూనియర్ అథ్లెట్లను అక్కడి కోచ్ లైంగికంగా వేధించినట్టు దర్యాప్తులో చేరింది. దీంతో అతడిపై వేటేసిన అధికారులు, మరో కోచ్‌ను తప్పనిసరిగా తప్పుకోవాల్సిందిగా ఆదేశించారు. మరో కోచ్‌పై అంతర్గత దర్యాప్తు చేపట్టారు.
 
మరోవైపు సాయ్ అధీనంలోని గుజరాత్, బెంగళూరులోని కేంద్రాల్లోనూ క్రీడాకారిణులపైనా కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో వాటిపైనా దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులో అయితే ఓ కోచ్, సహచర మహిళా కోచ్‌ను, అకౌంటెంట్‌ను కూడా వదల్లేదు. అశ్లీల మెసేజ్‌లు పంపి వేధించాడు. కేంద్రాల్లో జరుగుతున్న ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సాయ్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ... ఛెత్రి ట్వీట్‌పై కేటీఆర్ స్పందన