కిషోర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కొత్తచిత్రం... త్వరలో...
గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ క
గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ కథను ముందుగా నానికి వినిపించాడట. కానీ నానికి ఇది అంతగా నచ్చలేదని సమాచారం.
అప్పుడు కిషోర్ ఆ చిత్రానికి కాస్త మార్పులు చేసినా కూడా నానికి నచ్చలేదట. దాంతో కిషోర్ తిరుమల ఆ చిత్రాన్ని సాయిధరమ్ తేజ్‌కి వినిపించాడట. సాయిధరమ్‌కు ఈ కథ నచ్చడంతో తను ఆ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాడట. త్వరలోనే సాయిధరమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సెట్స్‌పైకి రానున్నది.