Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా, మనకు మంత్రి పదవి ఇస్తారా? తిరుపతి ఎమ్మెల్యే దగ్గర నేతలు..

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (22:32 IST)
చిత్తూరు జిల్లా నుంచే ఇప్పటికే ఫైర్ బ్రాండ్ రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు దాదాపుగా మంత్రి పదవులు ఇవ్వడం ఖాయమైంది. అంతేకాదు రోజాకు సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారట. సినీరంగంలో రాణించిన రోజాకు ఆ శాఖ అయితే కరెక్ట్‌గా ఉంటుందన్నది సిఎం అభిప్రాయమట. 

 
ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసి ఇక మంత్రి కాబోతున్నారు. ఆయనకు ఏ శాఖ అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ చిత్తూరు జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి వస్తుందా లేదా అన్న ఆలోచనలో పడిపోయారు. ఆయనెవరో కాదు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.

 
మంత్రి పదవులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది నేతలు భూమనను కలిశారట. అన్నా... మీకు కూడా మంత్రి పదవి ఇస్తారు కదా అన్న.. మీరు పార్టీలో చాలా సీనియర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ వరకు మనం ఇలాగే కొనసాగుతున్నాం.

 
వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పారు. ఇక మంత్రి పదవి ఇప్పుడు మీకు కేటాయిస్తే బాగుంటుంది కదా అన్నా అంటూ అడిగారట నేతలు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారట. ఇప్పుడు ఆ చర్చ అనవసరమని ఆయన సన్నిహితులు తోసిపుచ్చారట.

 
అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది భూమనకు మంత్రి పదవి వచ్చే అవకాశమే లేదట. అసలు మంత్రి పదవి కావాలని సిఎంను అడిగితే కదా ఇస్తారు. ఉన్న పదవితోనే భూమన కరుణాకర్ రెడ్డి సంతృప్తిగా ఉన్నారట. అందుకే వేరే పదవుల కోసం పాకులాడటం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments