Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మళ్లీ కరోనా.. నాలుగో వేవ్ ముప్పు తప్పదు.

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (21:19 IST)
ప్రపంచ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. భారత్‌లో మళ్లీ కరోనా విజృంభించే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో కరోనా నాలుగో వేవ్ ముప్పు పొంచి వుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 
 
కరోనా నాల్గో వేవ్ ముప్పును ముందుగానే కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు.
 
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కరోనా కేసులకు సంబంధించి కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 
 
ప్రధానంగా కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి మూడు అంశాలపై దృష్టి సారించాలని మాండవీయ అధికారులను ఆదేశించారు. 
 
ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ అధికారులను సూచించారు. కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments