Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుర్రాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు, లింకు పెట్టుకున్నావా అంటూ...

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:36 IST)
ప్రేమను జయించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి వేరు కాపురం పెట్టాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే అతనిలో అప్పుడే అనుమానం పెనుభూతంగా మారింది. భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రగిలిపోయాడు. అతి దారుణంగా భార్యను చంపేశాడు.
 
చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలోని బిసి కాలనీలో నివాసముండే సూరిబాబు, సుహాసినిలకు ముగ్గురు పిల్లలున్నారు. వీరికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూరిబాబు టైలర్. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ప్రశాంతంగా సాగిపోయే కుటుంబం.
 
అయితే టైలరింగ్ కోసం వచ్చే కొంతమంది యువకులతో సుహాసిని క్లోజ్‌గా మాట్లాడటం చూశాడు సూరిబాబు. దీంతో భార్యపై ఇంతెత్తున లేచాడు, వాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు. వారితో లింక్ పెట్టుకున్నావా అంటూ దారుణంగా మాట్లాడాడు. తను మామూలుగా మాట్లాడుతున్నానే తప్ప ఎవరితోను క్లోజ్‌గా లేనని సుహాసిని చెప్పింది. అస్సలు వారితో మాట్లాడవద్దు అంటూ షరతలు పెట్టాడు భర్త. ఇదంతా గత రెండు నెలల నుంచి సాగుతోంది.
 
అయితే ఈరోజు సాయంత్రం ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి మాటామాటా పెరిగింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న సూరిబాబు భార్య సుహాసిని తలపై రోకలి బండతో మోది అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments