Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ హేళనగా మాట్లాడారట... అందుకే గేట్లు మూసేశారట పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి

వై.సి.పి.అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకుండా చాలామంది ఎమ్మెల్యేలు, నేతలందరూ అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరగా మరో ఎమ్మెల్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే ఈశ్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:48 IST)
వై.సి.పి.అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకుండా చాలామంది ఎమ్మెల్యేలు, నేతలందరూ అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరగా మరో ఎమ్మెల్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ పుచ్చుకోవడానికి ప్రధాన కారణం తెలిస్తే షాకవుతారు వైసిపి నేతలు. తన నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్‌ల పాలన కొనసాగుతోందని, ఎమ్మెల్యేగా ఉన్న తనను అస్సలు పట్టించుకోవడం లేదని, అధినేత దృష్టికి తీసుకెళ్ళినా ఆయన అంతా సర్దుకుంటుందిలేమ్మా అంటూ పంపించేయడం ఏ మాత్రం ఈశ్వరికి ఇష్టం లేదు.
 
అందులోను అధినేతే తనను చాలా హేళనగా మాట్లాడారంటూ ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో తన అనుచరులతో ఈశ్వరి ఈ విషయాన్ని చెప్పి బాధపడుతోందట. పార్టీ మారాలన్న ఆలోచన ఈశ్వరిలో చాలాకాలంగా వుందట. కానీ తన అనుచరులు సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో వెనక్కి తగ్గింది ఈశ్వరి. అయితే పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ధర్మశ్రీ నుంచి కూడా సరైన విలువ తనకు లేకపోవడం మరింత బాధించిందట. 
 
నిన్న సాయంత్రం నుంచి ఈశ్వరి పార్టీ మారుతారన్న ప్రచారం సాగుతుండటంతో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వున్న ధర్మశ్రీ ఆమె ఇంటికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే ఈశ్వరి మాత్రం ధర్మశ్రీతో మాట్లాడటానికి అస్సలు ఒప్పుకోలేదట. వైసిపి నాయకులెవరినీ ఇంటి వద్దకు రావద్దని గేట్లు కూడా మూసేశారట.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments