Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా?

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. తనపట్ల ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఐఏఎస్ నడుచుకున్న తీరుతో తీవ్ర మనస్

ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా?
, బుధవారం, 22 నవంబరు 2017 (13:27 IST)
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. తనపట్ల ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఐఏఎస్ నడుచుకున్న తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. ఈ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. 
 
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన రాజీనామా వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన రంగంలోకి దిగిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వల్లభనేనిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 
 
ఈవివరాలను పరిశీలిస్తే, విజయవాడ హనుమాన్‌ జంక్షన్‌లోని డెల్టా షుగర్స్‌ విషయంలో సీఎంవోలోని ఓ అధికారి తీరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే వంశీ తన రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన మరో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌... వంశీ వద్ద నుంచి రాజీనామా లేఖను తీసుకుని చింపివేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో వంశీని బుజ్జగించే అంశాన్ని పార్టీ సీనియర్‌ నేత కళా వెంకట్రావుకు అప్పగించారు. 
 
కాగా డెల్టా షుగర్స్‌ను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఉంది. అయితే తన నియోజకవర్గం నుంచి డెల్టా షుగర్స్‌ను తరలించవద్దని, అనేకమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయంటూ ఈ విషయంపై  ఎమ్మెల్యే వంశీ ఇవాళ కొంతమంది రైతులతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వెళ్లారు. 
 
కానీ, సీఎంవో కార్యాలయానికి చెందిన ఓ అధికారి... ఎమ్మెల్యే వంశీని అడ్డుకుని, విషయం తమతో చెప్పాలని, సీఎంను కలిసేందుకు ఇప్పుడు వీలు కాదని చెప్పడంతోపాటు ఏకంగా రెండు గంటల పాటు వెయిట్ చేయించారట. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఓ దశలో ఆ అధికారి దురుసుగా ప్రవర్తించడంతో వంశీ... మనస్తాపంతో రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిజర్వు బ్యాంకులో ఆఫీస్ అటెండర్ పోస్టులు