Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికే మకాం మార్చేస్తోన్న జగన్.. ఎందుకుంటే..?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (21:43 IST)
ఫలితాలకు ఇక తొమ్మిదిరోజుల సమయం మాత్రమే ఉంది. గెలుపు ధీమాలో ఎవరికి వారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సర్వేలు అనుకూలంగా వస్తే ఇక విజయం మాదేనన్న ధీమాతో ఉన్నాయి. ఇక జగన్ అయితే ఏకంగా తన ప్రభుత్వంలో ఐఎఎస్‌లు ఎవరిని నియమించాలన్న నిర్ణయంలో కూడా ఉన్నారట. తాజాగా వైసిపి తన కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చేస్తోంది.
 
ప్రధానంగా వైసిపి కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పార్టీని తెలంగాణా రాష్ట్రంలో కూర్చుని పార్టీ కార్యకలాపాలను సాగించడం ఏంటని టిడిపి నేతలు ప్రశ్నిస్తూనే వస్తున్నారు. అయితే అదేదీ పట్టించుకోని జగన్ తాను మాత్రం లోటస్‌పాండ్‌నే వేదికగా చేసుకుని ముందుకు వెళ్ళేవారు.
 
కానీ ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ముందుగానే జగన్ అమరావతిలో పార్టీ కార్యాలయాన్ని నిర్ణయించేసుకున్నారు. ఇప్పటికే లోటస్‌పాండ్ నుంచి సామగ్రి మొత్తాన్ని షిఫ్ట్ చేయడం ప్రారంభించారు. ఒక్కొక్కటిగా ఫర్నిచర్‌ను తీసుకెళుతూ ఈ నెల 21వ తేదీలోగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్న నిర్ణయానికి జగన్ వచ్చేశారట. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పార్టీకి సంబంధించిన వ్యవహారాలను హైదరాబాద్‌కు వెళ్ళి చక్కదిద్దితే బాగుండదన్న నిర్ణయానికి వచ్చారట జగన్. అందుకే హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments