Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల వేళ ఇంటింటికీ ఇస్తానన్న బియ్యం ఏది?: పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (20:16 IST)
ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇంటింటికీ తీసుకువచ్చి ఇస్తామన్న బియ్యం ఏది? వారు చెప్పిన అసలు బియ్యం ఏది? అని జనసేన నాయకుడు  పవన్ కళ్యాణ్ అడిగారు.

కాకినాడ రైతు సౌభాగ్య దీక్ష వేదికపై ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని శాంపిల్స్ ను పవన్ కళ్యాణ్‌కు అందచేశారు. ప్రభుత్వం ఇస్తానని వాగ్దానం చేసిన అసలైన సన్న బియ్యం శాంపిల్స్ కూడా జనసేనానికి చూపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ  “మాట తప్పిన బియ్యం ఏది? మాటిచ్చిన బియ్యం ఏది?” అని అడగగా.. లీలాకృష్ణ చూపించారు.

మా పేపర్ తప్పు చేసింది నాకు సంబంధం లేదన్నారే అని జనసేనాని అనగా, ఆయన పేపర్లో వేసేవి అన్నీ తప్పులే కదా సర్ అంటూ లీలాకృష్ణ బదులిచ్చారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్  ముగించారు. అంతకు ముందు బియ్యంలో తేడాలను లీలా కృష్ణ వివరిస్తూ “ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం పథకం కోసం కస్టం మిల్లింగ్ విధానం తీసుకువచ్చింది.

ఈ విధానంలో రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి దగ్గర్లో ఉన్న మిల్లులకు తోలుతుంది. క్వింటాల్ కి 67 కేజీలు మిల్లర్ ప్రభుత్వానికి తిరిగివ్వాలి. తవుడు, నూకతోపాటు కొంత ఛార్జ్ కూడా మిల్లర్ కి చెల్లిస్తారు. అయితే గత ప్రభుత్వం హయాంలో 25 శాతం వరకు ముక్కను, 17 శాతం వరకు తేమను ఈ విధానంలో అనుమతించేవారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకోవాలని ఆ నిబంధన పెట్టడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం వరకు ఆ నిబంధనలే అమల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగారు సన్న బియ్యం కోసం మిల్లర్ల దగ్గర నిల్వ ఉన్న బియ్యాన్ని తీసుకుని రీ సైక్లింగ్ చేసి పంపారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ సన్న బియ్యం అమలు చేయగా, అవి కాస్తా ముద్ద అయిపోయాయి.

ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో స్వర్ణ రకం బియ్యాన్ని సార్టెక్స్ మిల్లులో వేసి హామీని నిలబెట్టుకునేందుకు ఇన్ని లక్షల మంది కడుపు కొడుతున్నారు. అవగాహన లేకే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారు” అన్నారు. ఈ సందర్భంగా బియ్యం శాంపిల్స్ పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు.  
 
బీమాతో ధీమా అనే పరిస్థితి లేదు...
రైతు నాయకుడు జమ్మి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అండతో రైతు సమస్య ఫుల్ స్టాప్ పెట్టాలి. గత నెలలో కురిసిన వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకి 15-20 బస్తాలు మాత్రమే పంట వచ్చింది. ఇలా ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు పంటలను పాడు చేసినప్పుడు మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇవ్వాలి.

బస్తాకు రూ. 100 బోనస్ ఇవ్వాల్సి ఉంటే అదీ లేదు. లాభసాటి ధర మాట పక్కనపెడితే కనీసం మద్దతు ధర ఇచ్చేది అంతంత మాత్రమే. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో మొదటి పంటలో రైతుకు చేరేది శూన్యం. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అనేది తీసుకువచ్చింది. రూపాయి కడితే చాలు అంటున్నారు. కట్టేది తక్కువే కదా అన్న మాట పక్కనపెడితే వరదలు, వైపరీత్యాలు వచ్చినా బీమా మాత్రం రాదు అన్నది నిజం.

బీమా అమలులో ఇప్పటికీ బ్రిటీష్ కాలం నాటి పద్దతులే అమలు చేస్తున్నారు. ఏడు సంవత్సరాల యావరేజ్ చూస్తున్నారు. పంటకు నష్టం వాటిల్లినప్పుడు గత ఏడాది పండింది కాబట్టి ఈ ఏడాది ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. పంట పోయిన మేరకు భీమా వస్తే ధీమా ఉంటుంది. దిగుబడిలో ఎంత మేర నష్టం వచ్చిందో అది ఇప్పించే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలి. ఓసీలకు రైతు భరోసా లేదనడం దుర్మార్గమైన చర్య” అన్నారు.
 
జనసైనికులు రైతు సైనికులుగా మారాలి....
భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల జమిల్ మాట్లాడుతూ “రైతే రాజు, రైతే దేశాన్ని వెన్నుముక అని చెప్పే నాయకులంతా రైతులకు పెద్ద నామమే పెడుతున్నారు. జన సైనికులంతా రైతు సైనికులుగా మారి రైతు సమస్యలపై ఎప్పుడు పిలుపు ఇచ్చినా పోరాటం చేయాలి. రైతుకు పంట పండించడం మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏమొస్తుంది ఎంత వస్తుంది తెలియదు.

అందుకే గత 15 సంవత్సరాల్లో 3 లక్షల 25 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ హత్యలకు ప్రభుత్వాల చర్యలే కారణం. క్రాప్ హాలిడే ప్రకటించిన రోజు చాలా మంది నాయకులు కోనసీమకు వచ్చి మమ్మల్ని నమ్మించి పదవిలోకి వచ్చారు. ఆ తరవాత ఏం చేశారో అందరికీ తెలుసు. రైతులలో సంఘటిత శక్తి లేదు అంటున్న వారికి ఒక పంట రాష్ట్ర వ్యాప్తంగా ఆపేస్తే ఆ శక్తి ఏంటో తెలుస్తుంది” అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

వంద రోజుల పాటు ఆలరించిన రియాలిటీ షో ... నేడు బిగ్‌బాస్ టైటిల్ ప్రకటన

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments