Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ నటన : మంత్రి వెల్లంపల్లి

Advertiesment
చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ నటన : మంత్రి వెల్లంపల్లి
, గురువారం, 5 డిశెంబరు 2019 (15:41 IST)
ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. 
 
గురువారం నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. 35వ డివిజన్ చర్చి వద్ద నుంచి తన పర్యటన ప్రారంభించిన మంత్రి... స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న అడ్డరోడ్డు, మసీదు ఎదురు రోడ్డు నిర్మాణము మరియు కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, మెట్లుకు మరమత్తుల పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన ఘనత మాజీ సీఎం చంద్రబాబు కి చెందుతుందని అన్నారు.
 
గత ఐదు సంవత్సరాలలో చేయలేని పనులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల్లో చేసి చూపిస్తున్నారు అన్నారు. 
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నారని మంత్రి శ్రీనివాసరావు ఆరోపణలు గుప్పించారు.
 
ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ జమల పూర్ణమ్మ, 35వ డివిజన్ అధ్యక్షులు సుదీర్, మహిళా అధ్యక్షురాలు ప్రమీల, విజయలక్ష్మి, శీను పల్లెపు ప్రసాద్, కృప, చెరుకూరి శీను తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్... చంద్రబాబు బినామీ : సి. రామచంద్రయ్య