Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లుగా భావించి ఫార్మాలిన్ తాగేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:16 IST)
వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఒక విషాద ఘటన సంభవించింది. మంచనీళ్లు అనుకుని ఫార్మాలిన్‌ను ఇద్దరు కూలీలు తాగేశారు. దీంతో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
జిల్లాలోని అత్తిలి మండలం గుమ్మంపాడుకు చెందిన నడింపల్లి సుబ్బరాజు (51), పాతగొ లుసు రామకృష్ణ (70) రెండేళ్లుగా అత్తిలిలోని ఒక కోళ్లఫారంలో కూలీలుగా పనిచే స్తున్నారు. కొత్తగా కోడి పిల్లలు వస్తున్న సందర్భంగా ఈ నెల 12న ఫారంలో ఫార్మాలిన్ మందును స్ప్రే చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో మంచినీటి డబ్బా పక్కన ఫార్మాలిన్ మందు డబ్బా ఉండటంతో పొరపాటున మంచి నీళ్లనుకుని ఆ మందు కలిపిన నీరు తాగారు. 
 
దీంతో వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే అత్తిలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా రామకృష్ణ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. సుబ్బరాజును మెరుగైన చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆయన కూడా మంగళవారం ఉదయం మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్

కలి పాత్ర నేపథ్యంలో ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిసున్న కలి మూవీ

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది: రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments