Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 వీధి కుక్కలకు విషం.. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు

Webdunia
శనివారం, 31 జులై 2021 (14:31 IST)
300 వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపేయడంతో జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ప్రదర్శించి తీరు ఇప్పుడు దుమారం రాజేసింది. లింగపాలెం పంచాయతీ అధికారులు ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. 
 
మూగజీవాలను అత్యంత పాశవికంగా, ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను పొట్టున పెట్టుకున్నారు. గుంతలో అలా పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. ఇది చూసిన జంతు ప్రేమికులు కంటతడి పెట్టుకుంటున్నారు.
 
విశ్వాసానికి మారుపేరు గ్రామసింహాం. కొన్ని సందర్భాల్లో మనుషులపై దాడి చేయవచ్చు, తీవ్రంగా గాయపరచవచ్చు. అయితే మాత్రం అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తారా? వాటిని వదిలించుకునేందుకు ఏకంగా చంపేస్తారా? వాటిపై విషం చిమ్ముతారా అంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. చనిపోయిన కుక్కల కళేబారాలను చెరువు వద్ద గొయ్యిలో పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. 
 
కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారని ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తోంది. ఈ చర్యలకు పాల్పడ్డ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments