తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా అమ్రపాలి పని చేస్తున్నారు. ఈమెలో కలెక్టర్ అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, కలెక్టర్ హోదాలో ఉన్నాను కదా అంటూ ఒక గీత గీసుకొని మాత్రం ఉండరు. ఇప్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా అమ్రపాలి పని చేస్తున్నారు. ఈమెలో కలెక్టర్ అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, కలెక్టర్ హోదాలో ఉన్నాను కదా అంటూ ఒక గీత గీసుకొని మాత్రం ఉండరు. ఇప్పటికే పలు రకాల వినూత్న కార్యక్రమాలు నిర్వహించిన అమ్రపాలి.. తాజాగా మరో సాహసం చేశారు. దీంతో ఆమె మరోమారు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.
జిల్లాలో రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. అనంతరం రేగొండ మండలంలోని పాండవుల గుట్టను అమ్రపాలి అధిరోహించారు. దీంతో ఆమె పేరు వార్తలకెక్కింది. అంతేకాదు.. ఇప్పుడు అమ్రపాలి సోషల్ మీడియాలో ఓ ఐకాన్. యూత్ కు ఆదర్శం. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది ఈ కలెక్టరమ్మ.