తల్లిగా కలెక్టర్ ఆమ్రపాలి... బిడ్డగా బొజ్జగణపయ్య.. ఈ వీడియో చూడండి...
తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న కలెక్టర్లలో ఇద్దరికి మంచిపేరు ఉంది. వారిద్దరూ కూడా మహిళలే కావడం గమనార్హం. వారిలో ఒకరు స్మితా సభర్వాల్ కాగా, మరొకరు ఆమ్రపాలి కాట.
తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న కలెక్టర్లలో ఇద్దరికి మంచిపేరు ఉంది. వారిద్దరూ కూడా మహిళలే కావడం గమనార్హం. వారిలో ఒకరు స్మితా సభర్వాల్ కాగా, మరొకరు ఆమ్రపాలి కాట.
అయితే, మంచి పనితీరు కనబరిస్తే అధికారులను ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారని చెప్పడానికి ఇదో మచ్చుతునక. తన పనితీరు, ప్రవర్తనతో ఆకట్టుకునే వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మీద తమకున్న అభిమానాన్ని ఖాజీపేట యువత వినూత్నంగా చాటుకున్నారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆమ్రపాలి తల్లిగా మారి, వినాయకుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా ఉన్న విగ్రహాన్ని బాపూజీ నగర్ యువత తమ మండపంలో ప్రతిష్టించారు.
వీరి సృజనాత్మకతను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. ఆమ్రపాలి విగ్రహం ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు కూడా లైక్‌లు, షేర్లు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలి.. ఆఫీసులో మాత్రం జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉంటూ.. ప్రజల్లోకి వెళ్ళినపుడు వారితో కలిసిపోతూ ప్రతి ఒక్కరి మన్నలు పొందుతున్న విషయం తెల్సిందే.