Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నక్సల్స్ తిరిగే అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన మహిళా కలెక్టర్లు. ఆన్‌లైన్‌లో ఫొటోలు వైరల్

జిల్లా పాలనాయంత్రాగాన్ని పూర్తిగా తమ కనుసన్నలలో నిర్వహించే అత్యున్నత ఐఏఎస్ అధికారిణులు వారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యంత చురుకుగా ఉండే ఎనర్జిటిక్ ఈ ఇద్దరు కలెక్టర్లూ తీవ్రమైన పనిభారంతో ఉంటారు. ఒక

Advertiesment
నక్సల్స్ తిరిగే అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన మహిళా కలెక్టర్లు. ఆన్‌లైన్‌లో ఫొటోలు వైరల్
హైదరాబాద్ , మంగళవారం, 18 జులై 2017 (02:39 IST)
జిల్లా పాలనాయంత్రాగాన్ని పూర్తిగా తమ కనుసన్నలలో నిర్వహించే అత్యున్నత ఐఏఎస్ అధికారిణులు వారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జిల్లా పాలనాయంత్రాగాన్ని పూర్తిగా తమ కనుసన్నలలో నిర్వహించే అత్యున్నత ఐఏఎస్ అధికారిణులు వారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతీ మీనా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యంత చురుకుగా ఉండే ఈ ఇద్దరు కలెక్టర్లూ తీవ్రమైన పనిభారంతో ఉంటారు.  ఒక ఆదివారం ఆటవిడుపు కావాలనుకున్నారు. ఇంకే నేరుగా ఖమ్మం జిల్లా పరిధిలోని బయ్యారం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడినుంచి అడవిలోకి కాలి నడకన 12 కిలోమీటర్ల దూరం అలుపులేకుండా నడిచారు. తొలుత ఖనిజ నిక్షేపాలు పొదిగి ఉన్న బయ్యారం ఐరన్ ఓర్ గుట్టను సందర్శించారు. పెద్ద గుట్టపై 5 గంటల పాటు 12 కిలోమీటర్ల మేర నడిచారు. పచ్చని ప్రకృతి చూసి పరవశించి పోయారు. 
 
అక్కడ నుంచి కాకతీయుల కాలం నాటి బయ్యారం పెద్ద చెరువు వద్ద అలుగు మత్తడిని వీక్షించారు. చెరువు కట్టపై ఉన్న శిలాఫలకాన్ని చూపిస్తూ అధికారులు దాని ప్రాముఖ్యతను కలెక్టర్లకు వివరించారుకలెక్టర్లు ఇద్దరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా నడుస్తూ ఉంటే.. వారితో పాటు నడవలేక మిగిలిన అధికారులు ఆపసోపాలు పడ్డారు. వారి వెంట నడిచిన గన్‌మెన్లు అలసిపోయినట్లు కనిపించారు కానీ వీరిద్దరి వదనాల్లో అలసట అన్నేదే లేకుండా కనిపించడం విశేషం. అడవి యాత్ర ముగించుకుని వారిద్దరూ పెట్టిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
ఈ ఇద్దరు కలెక్టర్లలో ప్రీతి మీనా ఇటీవలే మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నుంచి చేదు అనుభవం  ఎదుర్కొని వార్తల్లోకెక్కారు. విషయం సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లడంతో ఎమ్మెల్యే చివరకు క్షమాపణ చెప్పారు. ఇక వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఉద్యోగాలు పొందాలంటే విద్యార్థులు చిన్న చిన్న అబద్దాలు చెప్పి తర్వాత వృత్తి నైపుణ్యం అలవర్చుకోవాలని చెప్పి తెలంగాణ మంత్రి కడియం శ్రీహర్ చేత మందలింపుకు గురయ్యారు. ఇంటర్వూలలో మంచి ఫలితాలు సాధించాలంటే యువతీ యువకులు కష్టపడి చదవడమే పరిష్కారం కాని అబద్దాలు చెప్పి ఉద్యోగాలు సాధించరాదని మంత్రి హితవు చెప్పారు.
 
కలెక్టర్లు అంటే అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తులు కాబట్టి గతంలో ఎవరూ తమ వ్యక్తిగత జీవితాలను, ఆనందాలను ఇలా ప్రదర్శించేవారు కాదు. కాని కొత్త తరం ఐఏఎస్ అధికారిణులు పాలనలోనే కాకుండా తమ అభిరుచులను కూడా బహిర్గతం చేయడంలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా తమను తాము వ్యక్తీకరించుకోవడం విశేషం. దాంట్లోనూ వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఎంత కుర్రతనమంటే వేదికపైనే డ్యాన్స్ ఆసక్తికరంగా చేయండం ఆమెకు అలవాటు. ప్రజలతో సన్నిహితంగా మెలగడంలో ఇదీ భాగమనే వీరు ఇంతవరకు కెరీర్‌లో మచ్చలేకుండా వ్యవహరించడం మరీ విశేషం. యువ అధికారిణులు పాటిస్తున్న కొత్త సంస్కృతిలో ఇదీ భాగమే మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి వెంకయ్యనాయుడు... చంద్రబాబు