Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబద్ధాలు చెప్పకపోతే ఉద్యోగం రాదు.. అబద్దం చెబితే వచ్చే ఉద్యోగం కూడా రాదు. ఈ తమాషా ఏంటి

ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పాలని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి నిరుద్యోగ యువతకు సూచించారు. బుధవారం వరంగల్‌ ములుగు రోడ్డులో జరిగిన జాబ్‌ మేళాలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్ప

Advertiesment
అబద్ధాలు చెప్పకపోతే ఉద్యోగం రాదు.. అబద్దం చెబితే వచ్చే ఉద్యోగం కూడా రాదు. ఈ తమాషా ఏంటి
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (09:23 IST)
ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పాలని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి నిరుద్యోగ యువతకు సూచించారు. బుధవారం వరంగల్‌ ములుగు రోడ్డులో జరిగిన జాబ్‌ మేళాలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్పాలి. లేదంటే ఉద్యోగం రాదు. అయితే సర్టిఫికెట్లు, మార్కుల పరంగా కాకుండా పని చేయగల సామర్థ్యం విషయంలో ఈ అబద్ధాలు చెప్పాలి. ఐదు నిమిషాలు పనిచేసే వారైనా.. రెండు గంటలపాటు పని చేస్తామని చెప్పాలి’’ అని అన్నారు.
 
కాగా ఉద్యోగం కోసం అబద్ధం చెబితే అడ్డంగా దొరికిపోతారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హెచ్చరించారు. వరంగల్‌ జాబ్‌మేళా సందర్భంగా నిరుద్యోగులకు కలెక్టర్‌ ఆమ్రపాలి ఇచ్చిన సూచనకు కడియం తన ప్రసంగంలో కౌంటర్‌ ఇచ్చారు. ‘ఇంటర్వ్యూను ప్రతిభతో ఎదుర్కోవాలి. అబద్ధమాడితే అడ్డంగా దొరికిపోతారు. చదువులో సాధించిన మార్కుల జాబితా, అనుభవం సర్టిఫికెట్లు అబద్ధాలాడవు. తెలివిగల అధికారి బోర్డులో ఉంటే అబద్ధాలను పసిగడతాడు. వచ్చే ఉద్యోగం కూడా రాకుండా పోతుంది’ అని అన్నారు.
 
ఇంతకూ తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వ్యాఖ్యపై అంత సీరియస్‌గా ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలీదు. తాము ఎక్కువ గంటలు పనిచేస్తామని చెప్పడం ద్వారా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చాలా కాజువల్‌గా కలెక్టర్ ఆమ్రపాలి చెప్పిన చిట్కాను సీరియస్ చేసి అదేదో నేరమన్న రీతిలో కడియం ఓవరాక్షన్ చేయడం ఎందుకో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేం హౌలాగాళ్లమా..! మెస్ నుంచి భోజనం తెప్పించి దళితవాడలో సహపంక్తినా?: కేసీఆర్