కలెక్టర్ అమ్రపాలి ఐఏఎస్ పరీక్షా టిప్స్... (Video)
తెలంగాణా రాష్ట్రంలో పని చేస్తున్న జిల్లా కలెక్టర్లలో అమ్రపాలి ఒకరు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరుగా తనదైనశైలిలో విధులు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఈమె కలెక్టర్ గిరికి ఆమడదూరంలో ఉంటారు. ప
తెలంగాణా రాష్ట్రంలో పని చేస్తున్న జిల్లా కలెక్టర్లలో అమ్రపాలి ఒకరు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరుగా తనదైనశైలిలో విధులు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఈమె కలెక్టర్ గిరికి ఆమడదూరంలో ఉంటారు. పైపెచ్చు యువతలో స్ఫూర్తి నింపేలా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
మొన్నటికిమొన్న సెల్ఫీలతో హాస్టళ్ల విద్యార్థుల్లో భరోసా నింపే కార్యక్రమం చేపట్టారు. స్కూల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్నారి డాక్టర్ పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో హెల్త్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా హన్మకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో హెల్త్ క్లబ్ ప్రారంభించారు. విద్యార్ధులే డాక్టర్లుగా సేవలందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం.
ఇదిలావుంటే ఐఏఎస్ కావాలనుకునే ఔత్సహిక యువతకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పైపెచ్చు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు వారికి పలు రకాల టిప్స్ చెపుతున్నారు. సులక్ష్య సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ టిప్స్‌ను వెల్లడించారు. ఆవేంటో ఈ వీడియో చూడండి.