Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి శ్రీహిత రేప్ - అత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (13:47 IST)
వరంగల్ జిల్లాలో జరిగిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా తేలిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జూన్ 18వ తేదీన హన్మకొండలోని తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీహిత అనే 9 నెలల చిన్నారిని ప్రవీణ్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం జరిపి చంపేశాడు. ఈ హత్యపై వరంగల్ పట్టణం ఆగ్రహంతో ఊగిపోయింది. అలాగే, ప్రవీణ్‌కు ఎలాంటి న్యాయం సహాయం చేయరాదని వరంగల్ బార్ కౌన్సిల్ తీర్మానం చేసి, అలాగే నడుచుకుంది. 
 
ఈ క్రమంలో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ కేసు విచారణ కేవలం 48 రోజుల్లో పూర్తి చేశారు. అలాగే, 30 మందికిపైగా సాక్షులను విచారించారు. 
 
అన్నిటికంటే ముఖ్యంగా, నేరం చేసినట్టు ముద్దాయి ప్రవీణ్ జడ్జి జయకుమార్ ఎదుట అంగీకరించాడు. దీంతో ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ మొదటి అదనపు కోర్టు జిడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments