ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాలామంది స్వాగతిస్తున్నారు. కొంతమంది విభేదిస్తున్నారు. మరికొంతమంది తమ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయ.
ఉత్తరప్రదేశ్ కతౌలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ... బ్యాచ్‌లర్స్ దర్జాగా కశ్మీర్ వెళ్లి అక్కడ ప్లాట్లు, భూములు కొనుగోలు చేసుకోవచ్చు, అంతేకాదు అక్కడి అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవంటూ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తాలూకు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి దీనిపై భాజపా ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.