రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (13:59 IST)
వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. విశాఖ డీఆర్ఎం బంగ్లాలో సోదాలు జరిపి భారీ మొత్తంలో నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
విశాఖ జిల్లా వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎంగా సౌరభ్ ప్రసాద్ పని చేస్తున్నారు. ఈయన ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సౌరభ్ ప్రసాద్ లంచం డబ్బును ముంబైలో తన ఇంటికి వచ్చి ఇవ్వాలని సూచించాడు. దాంతో కాంట్రాక్టర్ ముంబై వెళ్లి రూ.25 రూ.లక్షలు లంచం ఇస్తుండగా, సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 
ఇదేక్రమంలో ఇటు విశాఖలోని డీఆర్ఎం బంగ్లాలో సీబీఐ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీ, విశాఖకు చెందిన రెండు బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments