Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నుంచే ఓటు వేసేలా..ఈ-ఓట్‌ యాప్‌కు రూపకల్పన

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (21:53 IST)
ఇంటి నుంచే ఓటు వేసేలా ఓటింగ్‌ విధానంలో సరికొత్త రూపకల్పనల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచే ఓటు వేసేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ-ఓటింగ్‌ విధానం రూపుదిద్దుకుంటోంది. 
 
మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని దాని ద్వారా ఓటు వేసే సాంకేతిక ప్రక్రియ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), తెలంగాణ ఐటీ శాఖ,కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్‌,బొంబాయి ఐఐటీ,భిలాయ్‌ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ-ఓటింగ్‌ యాప్‌ తయారైంది.     
 
వివిధ ప్రయోగాలు, పరిశీలనల అనంతరం దీనికి తుదిరూపు ఇచ్చారు. అనేక భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు. 
 
అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే ముందుగా రాజకీయ పార్టీలకు దీని గురించి వివరించి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. మొదట కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరిశీలిస్తారు. ఆ తర్వాత తుది ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments