మొక్కజొన్న కంకి మృత్యుపాశమైంది.. బ్రెయిన్ డెడ్ రూపంలో భర్తను దూరం చేసింది...

ఠాగూర్
బుధవారం, 22 అక్టోబరు 2025 (10:41 IST)
మొక్కజొన్న కంకి మృత్యుపాశమైంది. బ్రెయిన్ డెడ్ రూపంలో భర్తను దూరం చేసింది. వెలుగుల పండుగ దీపావళి రోజున ఆ ఇంటి చిరు చీకట్లు నింపింది. దీంతో యేడాదిన్నరం వివాహ బంధం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం కొండగండ్రేడులో జరిగింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన పాపినాయుడు (27) అనే వ్యక్తి ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు గత యేడాది ఏప్రిల్ నెలలో అదే గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైంది. ఈ నెల 17వ తేదీన ఇంటి వద్ద భార్యకు సీమంతం చేశారు. అనంతరం స్నేహితులను కలిసేందుకు అచ్యుతాపురానికి వెళ్లి తిరిగి బైకుపై వస్తుండగా రాజుగారి కొబ్బరితోట వద్ద రోడ్డుపై రైతులు మొక్కజొన్న కంకుల ఆరబెట్టి ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది. 
 
దీంతో కిందపడిన పాపినాయుడు తలకు బలమైన గాయమైంది. ఆయనను విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ ఇంట దీపాల పండుగ రోజున చీకట్లు అలముకున్నాయి. కాగా, గత 2012లో పాపినాయుడు తండ్రి కూడా ఇదే తరహా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments