తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. స్కూటీని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన సంభవించింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కామారెడ్డి నుంచి భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. స్కూటీపై ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి, తాత వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఆరేళ్ల బాలుడు, తల్లి మృతిచెందారు. తాత, నాలుగేళ్ల పాపకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు కూడా చనిపోయారు. మృతులు ఖమ్మంకు చెందిన వారిగా తెలిసింది.
56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?
హైదరాబాద్ నగరంలో మరోమారు రేవ్ పార్టీ కలకలం రేపింది. 56 మంది పురుషులు 20 మంది మహిళలు కలసి ఈ రేవ్ పార్టీని చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీపై పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పాల్గొన్న వారంతా ఎరువుల తయారీ కంపెనీ యజమానులు కావడం గమనార్హం. ఈ యజమానుల కోసం 20 మంది అర్థనగ్న దుస్తుల్లో నృత్యం చేయించారు.
పోలీసుల కథనం మేరకు.. రాక్‌స్టార్ ఫెర్టిలైజర్ యజమాని సైదారెడ్డి, వేద అగ్రి ఫెర్టిలైజర్‌కి చెందిన డీలర్ తిరుపతి రెడ్డి కలిసి ఫెర్టిలైజర్ యజమానుల కోసం ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మహేశ్వరం మండలం కె.చంద్రారెడ్డి రిసార్టులో ఏర్పాటు చేశారు.
ఇందులో 56 మంది ఫెర్టిలైజర్ కంపెనీల యజమానులు, 20 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరూ అర్థనగ్నంగా నృత్యం చేస్తుండగా, మహేశ్వరం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో అక్కడకు వెళ్లిన పోలీసులు కాసేపు అక్కడే ఉండి తనిఖీలు చేశారు. ఈ రేవ్ పార్టీ కోసం ఉపయోగించిన విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.