తెలంగాణ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏంబీఏ పూర్తి చేసిన ఓ యువతికి పది నెలల క్రితం వివాహం చేసుకుంది. ఇపుడు ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ ఘటన మాక్లూర్ మండలం దాస్ నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు.
స్థానిక పోలీసుల వెల్లడించిన వివరాల మేరకు.. నందిపేట్ మండలం తల్వెద గ్రామానికి చెందిన నీరిడి చింటుకు, కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూరు చెందిన పూజ(25)కు పది నెలల కిందట వివాహమైంది. ఎంబీఏ పూర్తిచేసిన ఆమెకు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ నెల 17న ఇంటర్వ్యూకు హాజరుకావాలని చెప్పింది. బుధవారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్‌లో అజంత ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఉదయానే ద్విచక్రవాహనంపై భార్యాభర్తలతో పాటు చింటు తండ్రి నారాయణ(62) బయలుదేరారు. దాసనగర్ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో ముగ్గురూ కింద పడ్డారు.
నీరడి నారాయణకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన కోడలు, కొడుకులకు గాయాలు కావడంతో ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ పరిశీలించారు. ప్రమాదం జరగడానికి దారితీసిన కారణాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్ పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది.