Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిని విశాఖకు తరలించడం తథ్యం..ఎంపీ విజయసాయిరెడ్డి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (08:56 IST)
అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించడం తథ్యమని, ఈ ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామని ఆయన వెల్లడించారు. అయితే నిర్దిష్టమైన సమయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. కొవిడ్‌ నియంత్రణ, విశాఖ నగర పరిధిలోని అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ''మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ కేసులకు, రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే హక్కు ఉంది. చంద్రబాబునాయుడు కూడా కొన్నినెలలు హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రాన్ని పరిపాలించారు'' అని విజయసాయిరెడ్డి చెప్పారు.
 
విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముడసర్లోవ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments