Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఉచ్చులో చిక్కిన చంద్రబాబు : బీజేపీ ఎంపీ హరిబాబు

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కారని బీజేపీ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (11:26 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కారని బీజేపీ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంపై హరిబాబు స్పందిస్తూ, ప్రత్యేకహోదా పేరుతో భాజపా, తెలుగుదేశం పార్టీల మధ్య చిచ్చుపెట్టి రెండింటినీ విడగొట్టాలని జగన్‌ పన్నిన ఉచ్చులో చంద్రబాబు చిక్కారన్నారు. 
 
తాజాగా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందిస్తూ, 'పవన్‌కల్యాణ్‌, జగన్‌ను భాజపానే నడిస్తోందన్న ఆరోపణలు వాస్తవంకాదు. కాకినాడ సభలో పవన్‌ భాజపాను తీవ్రంగా విమర్శించినప్పుడు ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు అదే వ్యక్తితో భాజపాకు ముడిపెట్టడం ఆశ్చర్యకరం. 2014 ఎన్నికల్లో భాజపా, తెదేపా కలవడంవల్లే వైకాపా ఓడిపోయింది కాబట్టి హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చి రెండు పార్టీలు విడిపోయేలా జగన్‌ చేశారు. ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలగడం, కేంద్రం ఏమీ చేయలేదనడం అన్యాయం. పవన్‌, జగన్‌లు మోడీని విమర్శించడంలేదని తెదేపా చెప్పడం ఆశ్చర్యకరం. వారిద్దరూ మోడీని తిడుతుంటే ఆనందించాలనుకుంటున్నారా? అని హరిబాబు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments