Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజా... నీ గుట్టంతా నాకు తెలుసు... ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేస్తా : తెదేపా ఎమ్మెల్యే

వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్ ఆర్.కె.రోజాపై తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. 'రోజా... నీ సంగతి అంతా తెలుసు నిన్ను ఎక్కడ కట్‌ చేయాలో అక

Advertiesment
Yarapathineni Srinivasa Rao
, శనివారం, 17 మార్చి 2018 (09:33 IST)
వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ మహిళా ఫైర్‌బ్రాండ్ ఆర్.కె.రోజాపై తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. 'రోజా... నీ సంగతి అంతా తెలుసు నిన్ను ఎక్కడ కట్‌ చేయాలో అక్కడే కట్‌ చేస్తాను. మిగతావాళ్లతో పెట్టుకున్నట్టు దయచేసి నాతో పెట్టుకోవద్దు' అంటూ ఆయన హెచ్చరించారు. 
 
శుక్రవారం మాచవరం మండలంలోని కొత్తగణేశునిపాడు, పిల్లుట్ల గ్రామాలలో మండల జన్మభూమి సభ్యులు తాళ్లూరి అమరనాథ్ అధ్యక్షతన దళిత తేజం - తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, నా గురించి మాట్లాడే అర్హత నీకు (రోజా) లేదంటూ విమర్శించారు. 
 
పల్నాడు ప్రాంతంలో ఎన్నడులేని విధంగా కోట్లాది రూపాయలు తెచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు ఆవాకులు, చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే చెన్నాయపాలెం రైతులపై 500 మంది గూండాలతో మారుణాయుధాలతో దాడులు చేసి పచ్చని పంట పొలాలను దున్నిన విషయం తెలిసిందేనన్నారు. ఆ గ్రామంలో పంటలు నష్టపోయిన రైతన్నలకు నా సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నానని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అవిశ్వాస అస్త్రం : మోడీ - షా ద్వయానికి ముచ్చెమటలు