Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణంలో పరువు హత్య.. కుమార్తెను చంపిన తండ్రి!

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (09:19 IST)
విశాఖపట్టణంలోని ఒకటో పట్ణణ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు హత్య జరిగింది. ప్రేమించిన యువకుడితో లేచిపోయిన కుమార్తెను కన్నతండ్రి హత్య చేశాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు స్వయంగా వెల్లడించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖ రెల్లి వీధికి చెందిన వరప్రసాద్, హేమలత అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమర్తెలు. పైగా ఈ దంపతులు చాలాకాలం క్రితం విడిపోయారు. పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉంటుంది. రెండో కుమార్తె లిఖిత శ్రీ (15) తండ్రితో కలిసి ఉంటూ పదో తరగతి చదువుకుంటుంది. వరప్రసాద్ మహప్రస్థానం వాహన డ్రైవరుగా పని చేస్తూ కుమార్తెను పెంచుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో లిఖితశ్రీ ఇటీవల తాను ప్రేమించిన యువకుడితో లేచి పోయింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు కుటుంబాలు రాజీకి వచ్చారు. గురువారం తన కుమార్తెను వరప్రసాద్ ఇంటికి తీసుకెళ్లాడు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో లిఖితశ్రీ అచేతనస్థితిలో పడివుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న వారు కేసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వరప్రసాద్‌ వద్ద విచారించగా అసలు విషయం వెల్లడించారు. పెద్ద కుమార్తె ప్రేమించినవాడితో వెళ్లిపోయిందని, రెండో కుమార్తె కూడా ప్రేమ అంటూ దూరం కావడాన్ని భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments