ప్రముఖ సినీ నటి సుస్మితాసేన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. బాయ్‌ఫ్రెండ్స్ వ్యవహారంలో సుస్మితా సేన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా ఆమె సోదరుడు చేసిన పనికి మళ్లీ సుస్మీతా సేన్ పేరు వినబడుతోంది. మాజీ విశ్వ సుందరి, ప్రముఖ సినీ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన భార్య చారు అసోపా గురించి తీవ్ర ఆరోపణలు చేశారు.
తన భార్యకు ప్రముఖ టీవీ నటుడు కరణ్ మెహ్రాతో వివాహేతర సంబంధం ఉందని తెలిపాడు. చారు తల్లి తనకు వాయిస్ నోట్స్ పంపిందని... చారుకు, కరణ్‌కు మధ్య వివేహేతర సంబంధం ఉందని చెప్పడానికి ఆ నోట్స్ సాక్ష్యమని సుస్మీతా సోదరుడు తెలిపాడు. ఆమెను ఒక వ్యక్తిగా ఎంతో గౌరవంగా చూశానని.. అయితే ఆమె మాత్రం మహిళా కార్డును వాడుతూ తనను వేధించిందని చెప్పాడు.
తనపై ఎన్నో ఆరోపణలు చేసినా తన కుటుంబ సభ్యులు మాత్రం ఆమెనే ఎక్కువ ప్రేమగా చూశారని వెల్లడించాడు. తనను ఎంతో అవమానించి, మానసికంగా హింసించిన చారును ఎప్పటికీ క్షమించబోనని చెప్పాడు