Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెలిండాతో తీవ్రమైన మనో వేదన అనుభవించా : మెలిండా గేట్స్

Advertiesment
bill gates - milinda gates
, బుధవారం, 5 అక్టోబరు 2022 (15:20 IST)
ముప్పై యేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ దంపతులు గత యేడాది విడాకులు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానేకాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంది. అలాంటి జంట విడిపోతున్నారనే వార్తతో యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురైంది. అయితే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 
 
తాజాగా మెలిండా ఫార్చ్యూన్‌ మేగజైన్‌తో తన విడాకులపై స్పందించారు. వాటివల్ల నమ్మశక్యం కాని అంతులేని వేదనను అనుభవించానని ఆమె వెల్లడించారు. 'వివాహబంధంలో ఇక ఏమాత్రం ఇమడలేకపోవడానికి నాకు కొన్నికారణాలున్నాయి. అయితే కొవిడ్‌కు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నాకు కావాల్సింది నేను చేసేందుకు తగినంత గోప్యతనిచ్చింది. 
 
విడాకుల విషయంలో నేను నమ్మశక్యంకానీ తీవ్రమైన వేదనను అనుభవించాను. అయితే ఆ బాధను దాటుకొని రావడానికి నాకు గోప్యత ఉండేది. నేను విడిపోయిన వ్యక్తితోనే తరచూ పనిచేస్తుండేదాన్ని. ఉదయం తొమ్మిదింటి సమయంలో నేను ఏడుస్తూ ఉంటే.. పదింటికల్లా ఆ కన్నీరు తుడుచుకొని ఆ వ్యక్తితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేదాన్ని. నేను మెరుగ్గా కనిపించాలనుకున్నాను' అని వెల్లడించారు.
 
తన విడాకుల గురించి గతంలో బిల్‌గేట్స్‌ కూడా స్పందించారు. 'గత రెండు సంవత్సరాల్లో నా జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నా దృష్టిలో మాది గొప్ప వివాహం. జరిగిన దానిని నేను మార్చలేను. నేను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అవకాశం వస్తే.. మెలిండానే మళ్లీ వివాహం చేసుకుంటా' అని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన చీతా హెలికాఫ్టర్