Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రాజీవ్ గాంధీ పార్క్ సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (15:44 IST)
సెప్టెంబ‌ర్ నెల నుంచి విజ‌య‌వాడ‌లోని రాజీవ్ గాంధీ పార్కులో సందర్శకులకు అనుమతి ఇస్తామ‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ చెప్పారు. అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను వేగవంతం చేసి పూర్తి చేయాల‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ అధికారుల‌ను అదేశించారు. శ‌నివారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి రాజీవ్ పార్క్ నందు చేపట్టిన సివిల్, గ్రీనరి అభివృద్ధి వ‌ర్క్ ప‌నుల పురోగతిని ప‌రిశీలించారు. పార్కును పూర్తిగా ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌న్నారు. చిన్నారుల కోసం మ‌ల్టీ ప్టే గ్రేమ్స్ ఏర్పాటు చేయాల‌న్నారు.
 
చిన్నారుల‌కు అందుబాటులో ఉండేలా పిల్ల‌ల పార్క్ నిర్మాణం జ‌ర‌గాల‌న్నారు.  బ్రిడ్జి మ‌రమ్మ‌తులు, పార్క్‌లో వాకింగ్ ట్రాక్‌తో పాలు గెజిబో నిర్మాణం పనులు పూర్తి చేయాల‌న్నారు. ప‌ర్యాట‌కుల‌కు, సంద‌ర్శ‌కుల‌కు ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నంతో క‌నువిందు చేసే విధంగా పార్క్ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు పూర్తి చేయాల‌న్నారు.

ఎమ్యూజ్ మెంట్‌ పార్కులో ఉండే విధంగా ఓపెన్ ఎయిర్‌ ధియోట‌ర్‌తో కూడి మ్యూజిక్ ఫౌంటెన్ నకు మరమ్మతులు నిర్వహించి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 
పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) వై.వి. కోటేశ్వరరావు, ఉద్యానవన శాఖాదికారి జె.జ్యోతి,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments