Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో చిత్తుగా ఓడిన కోహ్లీ సేన.. ఇంగ్లండ్‌ ఘన విజయం.. ఇషాంత్‌ శర్మ రికార్డ్

చెన్నైలో చిత్తుగా ఓడిన కోహ్లీ సేన.. ఇంగ్లండ్‌ ఘన విజయం.. ఇషాంత్‌ శర్మ రికార్డ్
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (14:14 IST)
england
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ పరాజయం ఓటమి పాలైంది. 39/1 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 227 పరుగల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఆరు వరసు టెస్టుల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 4 వికెట్లతో భారత్‌ జట్టును స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బతీశాడు. హాఫ్ సెంచరీలతో శుభ్ మన్ గిల్, కెప్టెన్ కోహ్లీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెస్, బెన్ స్టోక్ చెరో వికెట్ తీసుకున్నారు.
 
39/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. 58.1 ఓవర్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది. ఇక భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(50), విరాట్ కోహ్లీ(72) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. 
 
ఫలితంగా 22 ఏళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో భారత్‌ ఓటమిపాలైంది. చేతిలో 9 వికెట్లు.. ఆస్ట్రేలియాపై సాధించిన విజయం ఉత్సాహం.. నేపథ్యంలో గెలవకపోయినా కనీసం డ్రాతోనైనా గట్టెక్కుతుందని ఆఖరి రోజు ఆటకు ముందు భారత అభిమానులు లెక్కలేసుకున్నారు. కానీ బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌లో జేమ్స్ అండర్సన్(3/17), జాక్ లీచ్(4/76) చెలరేగడంతో అంతా అతలాకుతలమైంది.
 
అయితే ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్‌ టెస్ట్‌లో టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇండియా తరఫున టెస్ట్‌ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన థర్డ్‌ పేస్‌ పేసర్​గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఆరో ఇండియన్‌ బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో డాన్‌ లారెన్స్‌ వికెట్‌ తీయడంతో లంబూ 98 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. 
webdunia
Ishant sharma
 
అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌ దేవ్‌ (434), హర్భజన్‌ సింగ్‌ (417), అశ్విన్‌ ( ఈ మ్యాచ్‌తో కలిపి 386), జహీర్‌ ఖాన్‌ (311), ఇషాంత్‌ (300) కంటే ముందున్నారు. ఇప్పటివరకు ఇషాంత్‌ 11సార్లు ఐదు వికెట్ల హాల్‌ సాధించాడు. ఒకసారి 10 వికెట్లు తీశాడు. అయితే వేగంగా 300 వికెట్లు తీసిన లిస్ట్‌లో అశ్విన్‌ (54 మ్యాచ్‌లు) ముందుండగా, అనిల్​ కుంబ్లే (66), హర్భజన్‌ సింగ్​ (72), కపిల్‌ దేవ్‌ జహీర్‌ ఖాన్ (89) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం దిశగా టీమిండియా