Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టిరిన్ ప్రభావం ఇంకావుందా? సొమ్ముసిల్లిపడిపోయిన వలంటీర్లు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:20 IST)
ఇటీవల విశాఖ జిల్లా శివారు ప్రాంతమై ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 12 మంది మృత్యువాతపడగా, మరో 500 మంది వరకు తీవ్ర అస్వస్థతకులోనై విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో విష వాయువు ప్రభావం ఉన్న బాధిత గ్రామాల్లో గ్రామ వలంటీర్లతో ఏపీ సర్కారు సర్వే చేయిస్తోంది. ఈ విష వాయువు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సర్వేకు శ్రీకారం చుట్టారు. 
 
ఈ సర్వేలో పాల్గొన్న కుసుమ అనే వలంటీరు సొమ్ముసిల్లిపడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యశాఖ అధికారి తిరుపతి రావు తన సొంత వాహనంలోనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు.
 
అలాగే, మరో వలంటీరు నూకరత్నమ్మ కూడా ఇదే విధంగా సొమ్ముసిల్లిపడిపోయింది. ఆమెను కూడా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముఖ్యంగా, విష వాయువు పీల్చిని అస్వస్థతకు లోనైన వారిని గుర్తించే పనిలో వలంటీర్లు నిమగ్నమైవుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments