Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్యకు కాళ్లు చేతులు పడిపోతే..?

కట్టుకున్న భార్యకు కాళ్లు చేతులు పడిపోతే.. ఆ భర్త మరో మహిళను వెతుక్కుంటూ వెళ్లాడు. భార్యను పిల్లలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ప్రశ్నించిన భార్యను కొట్టి చంపేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచే

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:00 IST)
కట్టుకున్న భార్యకు కాళ్లు చేతులు పడిపోతే.. ఆ భర్త మరో మహిళను వెతుక్కుంటూ వెళ్లాడు. భార్యను పిల్లలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ప్రశ్నించిన భార్యను కొట్టి చంపేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలోని కోరాపల్లి గ్రామానికి చెందిన కోరాబు లక్ష్మీనాయుడు‌కు సొలభం పంచాయితీ పరిధిలోని కొత్త కొండలు గ్రామానికి చెందిన జానకమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. 
 
వ్యవసాయం చేస్తూ వీరు జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం జానకమ్మ అనారోగ్యానికి గురైంది. అనారోగ్యం కారణంగా జానకమ్మ కాలు, చేయి పడిపోయింది. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని లక్ష్మీనాయుడు మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకొన్నాడు. ఈ వ్యవహారంపై భర్తను భార్య నిలదీసింది.
 
ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకొంది. జానకమ్మపై లక్ష్మీనాయుడు కోపంతో కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై ఆదివారం నాడు జానకమ్మ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడు పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments