Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివమెత్తిన విరాట్ కోహ్లీ... 40వ సెంచరీ : ఆస్ట్రేలియా టార్గెట్ 251

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (17:07 IST)
ఐదు వన్డేల్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 251 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో వీరవిహారం చేశారు. తన వన్డే కెరీర్‌లో 40వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఏడో సెంచరీ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డుకు మరో 9 సెంచరీల దూరంలో ఉన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు తొలి ఓవర్ చివరి బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. అప్పటినుంచి ప్రారంభమైన వికెట్ల పతనం చివరివరకు కొనసాగింది. అయితే, కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్‌లో ఓవైపు సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. 
 
విజయ్ శంకర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించగా, జ‌డేజాతో క‌లిసి ఏడో వికెట్‌కు 67 ప‌రుగులు జోడించాడు. దీంతో టీమిండియా 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీకాకుండా విజయ్ శంకర్ ఒక్కడే 46 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ధావన్, జడేజా చెరొక 21 పరుగులు చేశారు. రోహిత్ (0), ధోనీ (0), జాదవ్ (18), రాయుడు (11) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 4, జంపా రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 120 బంతులు ఆడి 116 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments