Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదులపై దాడులు జరిపితే సహించం : పాకిస్థాన్

ఉగ్రవాదులపై దాడులు జరిపితే సహించం : పాకిస్థాన్
, ఆదివారం, 3 మార్చి 2019 (14:15 IST)
తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులు, ఉగ్ర తండాలపై భారత్ సహా ఏ ఒక్క ఇతర దేశం దాడులు చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. అలాగే, తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగడాన్ని పాకిస్థాన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదని ఆయన స్పష్టం చేశారు. 
 
పాక్ భూభాగం నుంచి భారత్ సహా ఇతర దేశాలు లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగడాన్ని కూడా సహించబోమని స్పష్టం చేశారు. బహావల్‌పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని పంజాబ్ (పాకిస్థాన్‌లోని) ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకుందని తెలిపారు. 
 
పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహమ్మద్ పాత్ర ఉందని, ఆ సంస్థ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నదన్నారు. పేర్కొంటూ ఇటీవల భారత్ ఆధారాల పత్రాన్ని సమర్పించిందని గుర్తుచేశారు. ఆధారాల పత్రంపై చర్చించాలని భారత్ కోరుకుంటే అందుకు తాము సిద్ధమేనన్నారు. 
 
ఇమ్రాన్‌ ఖాన్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం విధానాలు చాలా స్పష్టంగా ఉంటాయన్నారు. పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమని జైషే మహమ్మద్ ప్రకటించినట్లు ఓ ప్రకటన ఇటీవల విడుదలైంది. మేము జైషే మహమ్మద్‌ను సంప్రదిస్తే తాము దాడి చేయలేదని చెప్పింది. 
 
జైషే మహమ్మద్‌కు వ్యతిరేకంగా భారత్ సరైన ఆధారాలు సమర్పిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, భద్రతా బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉన్నాయని ఖురేషి చెప్పారు. ఇరుదేశాలు కూడా అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేలి ఉంగరం.. గడియారం ఇచ్చారు.. పిస్తోలు తిరిగివ్వని పాక్...