Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గోవిందా.. రాహుల్ గాంధీకి విజయశాంతి లేఖ?

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీగా నష్టపోతామని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలావున్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు ప

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (15:31 IST)
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీగా నష్టపోతామని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలావున్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. 
 
రాష్ట్ర విభజన తర్వాత సమస్యలు పరిష్కారం కాకుపోవడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కారణమని విజయశాంతి భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో టీడీపితో పొత్తును ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయాలని ఆమె అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబుతో పొత్తు నష్టాన్నే మిగిల్చుతుందని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. హైదరాబాద్‌లో కొన్ని సీట్లు గెలుస్తామనే ఉద్దేశంతో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని విజయశాంతి అన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments