రాహుల్ గాంధీ పెళ్లి ముచ్చట... ఏం చెప్పారో తెలుసా?

హరిత ప్లాజాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన మీట్ ది ఎడిటర్స్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చాలా హుపారుగా గడిపారు. మీడియా ప్రతినిధులకు చానెల్ ఎడిటర్స్‌కు అందరికీ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రతి టేబుల్‌కు వచ్చి రాహుల్ చిట్ చాట్

బుధవారం, 15 ఆగస్టు 2018 (17:48 IST)
హరిత ప్లాజాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన మీట్ ది ఎడిటర్స్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చాలా హుపారుగా గడిపారు. మీడియా ప్రతినిధులకు చానెల్ ఎడిటర్స్‌కు అందరికీ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రతి టేబుల్‌కు వచ్చి రాహుల్ చిట్ చాట్ చేసారు. ఆ తరవాత మిగిలిన టేబుళ్లన్నీ తిరుగుతూ సీనియర్ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 
తాను చెబుతున్న సమాధానాలను పాత్రికేయులు రికార్డు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రాహుల్. ఈ  భేటీలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు రాహుల్ గాంధీ తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. మీరు సాఫ్ట్ హిందూత్వకు సానుకూలమా? అన్న విలేకరి ప్రశ్నకు నేను ఏ హిందుత్వ కాదు అని రాహుల్ సమాధానం ఇచ్చారు. 
 
మరో మీడియా ప్రతినిధి మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు? అని అడగ్గా నా పెళ్లి కాంగ్రెస్ పార్టీతో జరిగిపోయిందని రాహుల్ సమాధానం ఇచ్చారు. అదీ రాహుల్ గాంధీ పెళ్లి ముచ్చట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు