Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్‌కు కేటీఆర్ కౌంటర్.. ఆ హక్కు మీకెక్కడిది?

తెలంగాణ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏకిపారేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలను తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేర్చలేకపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నీళ్లు,

రాహుల్‌కు కేటీఆర్ కౌంటర్.. ఆ హక్కు మీకెక్కడిది?
, బుధవారం, 15 ఆగస్టు 2018 (10:54 IST)
తెలంగాణ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏకిపారేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలను తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేర్చలేకపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు.


నీళ్లు, నిధులు, నియమాకాల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రజలకు ఆ ఫలాలు దక్కలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులకు, బలిదానాలు చేసుకున్నవారి కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ అమరవీరులకు తాను శ్రద్దాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. 
 
కేంద్రంలో రీడిజైన్ స్పెషలిస్ట్ మోదీ నోట్ల రద్దు చేస్తే.. తెలంగాణ రీడిజైన్ స్పెషలిస్ట్ కేసీఆర్ దాన్ని సమర్థించారని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అక్కడి రీడిజైన్ స్పెషలిస్ట్ గబ్బర్ సింగ్ ట్యాక్స్ పెట్టి ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే.. తెలంగాణ సీఎం దానికి చప్పట్లు కొట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు.మోదీ, కేసీఆర్ ఇద్దరూ పేద రైతుల వద్ద బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు.
 
ఇక రాహుల్ గాంధఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను హరిస్తోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మంగళవారంనాటి సరూర్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలపై మోదీ ప్రశంసలు 12 ఏళ్ల నీలగిరి పువ్వుల్లా?