13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన.. ఏఐసీసీ అధ్యక్ష హోదాలో?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌లలో పర్యటించనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష హోదాలో తొలిసారి రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన కోసం కాంగ్రె

శనివారం, 11 ఆగస్టు 2018 (10:19 IST)
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌లలో పర్యటించనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష హోదాలో తొలిసారి రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన కోసం కాంగ్రెస్ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా 13వ తేది మధ్యాహ్నం రెండున్నర‌కు శంషాబాద్ విమ‌నాశ్రయంలో దిగిన వెంట‌నే రాహుల్ నేరుగా శంషాబాద్‌లోని క్లాసిక్ క‌న్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన డ్వాక్రా గ్రూప్ మ‌హిళ‌ల మీటింగ్‌లో పాల్గొంటారు. 
 
అనంతరం శేరిలింగంప‌ల్లిలో ఏర్పాటు చేయనున్న బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి రాహుల్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బస చేస్తారు. ఒక రెండో రోజు 31వేల మంది బూత్ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్ మాట్లాడతారు. ఆ త‌ర్వాత అన్ని మీడియా సంస్థల ఎడిట‌ర్స్‌తో మాట్లాడిన అనంతరం.. హోట‌ల్ తాజ్ క్రిష్ణలో యువ పారిశ్రామిక వేత్తల‌తో రాహుల్ స‌మావేశమ‌వుతారు. 
 
అనంత‌రం ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో గోషామ‌హ‌ల్, నాంప‌ల్లి నియోజ‌వ‌క‌వ‌ర్గాల కార్యక‌ర్తల‌తో సమావేశమై పార్టీ పటిష్టతపై చర్చించనున్నారు. ఆ తరువాత టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లతో  ప్రత్యేకంగా భేటీ అవుతారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈడీ కేసులో నా భార్య ముద్దాయి.. ఆ వార్తల్ని చూసి షాకయ్యా: జగన్