Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం... బాలికపై రౌడీ షీటర్ అత్యాచారం

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (14:21 IST)
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళల పట్ల అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ముసలి, ముతక అన్న తేడా లేకుండా పసివారిపై సైతం తమ పైశాచికం చూపిస్తున్నారు కామాంధులు. తాజాగా ఏపీలో మరో చిన్నారి మానభంగానికి గురైంది. విజయవాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలికపై రౌడీ షీటర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
చిన్నారికి మాయమాటలు చెప్పిన రౌడీ షీటర్ చిన్నరాజా అమ్మాయిని ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు... గవర్నరుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీ షీటర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమాదు చేశారు.
 
ఇటీవలే దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన డిసెంబర్ 13వ తేదీనే గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. రామిరెడ్డి నగర్‌లో ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు రేప్ చేశాడు. పై పోర్షన్‌లో ఉండే లక్ష్మణ్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఈ దారుణం పాల్పడ్డాడు. దేశం దృష్టిని ఆకర్షించిన దిశ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన రోజే ఈ అత్యాచార ఘటన జరగడంతో.. ఈ కేసు విషయంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments