Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై కక్ష అలా తీర్చుకున్నాడు.. వాట్సాప్‌లో ఆ ఫోటోలను..?

భార్యపై కక్ష తీర్చుకున్నాడు ఓ భర్త. ఇది నిజమే. అనారోగ్యాన్ని దాచిపెట్టి.. పెళ్లి చేసుకుందనే అక్కసుతో భార్యపైనే కక్ష పెంచుకున్నాడు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని భార్య వివరణ ఇచ్చినా.. వినకుండా వేధింపులకు

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (14:28 IST)
భార్యపై కక్ష తీర్చుకున్నాడు ఓ భర్త. ఇది నిజమే. అనారోగ్యాన్ని దాచిపెట్టి.. పెళ్లి చేసుకుందనే అక్కసుతో భార్యపైనే కక్ష పెంచుకున్నాడు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని భార్య వివరణ ఇచ్చినా.. వినకుండా వేధింపులకు గురిచేశాడు. అభ్యంతరకర సందేశాలను, తన నగ్న చిత్రాలను భార్యకు వాట్సాప్‌లో పంపుతూ మానసికంగా వేధించాడు. ఈ ఘటన విజయవాడలోని కొత్తపేటలో చోటుచేసుకుంది. కొంతకాలం భర్త వేధింపులను భరించిన ఆ భార్య చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... కొత్తపేటకు చెందిన కొత్త నాగశ్రీనివాస కల్యాణ్‌ చక్రవర్తి(33) ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత భార్యకు నరాల సంబంధిత వ్యాధి ఉందని, ఆ విషయాన్ని తనకు చెప్పకుండా పెళ్లి చేశారని కక్ష పెంచుకున్నాడు.
 
ఈ విషయాన్ని భార్యతో ప్రస్తావించినా.. తనకు ఎలాంటి జబ్బు లేదని తేల్చి చెప్పేసింది. అయినా భర్త వినలేదు. అంతేగాకుండా భార్యపై విపరీతంగా కక్ష పెంచుకున్న కల్యాణ్ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. భర్త టార్చర్ భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో భార్య కాపురానికి రావడం లేదంటూ జూలైలో విజయవాడ కుటుంబ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ప్రతిగా, భర్త తనను హింసిస్తున్నాడంటూ బాధితురాలు ఎల్‌బీనగర్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న కల్యాణ్ వాట్సాప్‌లో ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు, తన నగ్నచిత్రాలు పంపడం మొదలుపెట్టి హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments