Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు... అక్టోబర్ 7 నుంచి‌ 15 వరకు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:27 IST)
బెజ‌వాడ  క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. తొమ్మిది రోజులు పాటు వ‌రుస‌గా అమ్మ‌వారు 9 రూపాల‌లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

అక్టోబర్ 7న స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, 8న  బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.  అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మిదేవిగా అమ్మవారు దర్శన మివ్వనున్నారు.
 
12న సరస్వతీదేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా,  15న రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్‌ 12 తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా అమ్మ‌వారి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతాయి. కానీ, ఈసారి కోవిడ్ పుణ్య‌మా అని భ‌క్తుల‌కు ఆంక్ష‌లు త‌ప్ప‌డం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments