Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌!

క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌!
విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (17:59 IST)
విజ‌య‌వాడ‌ను క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా చేద్దామ‌ని మంత్రి వెలంప‌ల్లి అన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి  వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, నగరంలో 18 సంవ‌త్స‌రాలు పైబ‌డి అంద‌రికీ రెండు రోజుల పాటు మెగా వాక్సిన్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. మొద‌టి డోస్‌గా 6,48,562 మందికి, మొదటి మరియు రెండోవ డోస్ టీకా కలిపి  నేటికి 8,61,237 మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. 
 
 ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 37 వ‌డివిజ‌న్‌లో ర‌జ‌క పాఠ‌శాల ఉన్న స‌చివాలయంలో వాక్సిన్ప్ర క్రియను మంత్రి ప‌రిశీలించారు. న‌గ‌రంలో 286 వార్డు స‌చివాల‌యంలో రెండు రోజ‌లు పాటు అన్ని కేటగిరీల వారికి టీకాలు వేయడం జరుగుతుంద‌న్నారు, అంద‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌రిమునిస్సా, న‌గ‌ర మేయ‌ర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్ శివ‌శంక‌ర్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్, ఇతర అధికారులు ఉన్నారు.

అర్హ‌త ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో వైసీపీ ప్ర‌భుత్వం పని చేస్తుంద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌ధాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శ‌క్ర‌వారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 37వ డివిజ‌న్లో ఎమ్మెల్సీ మహమద్ కరిమునిస్సా, న‌గ‌ర మేయ‌ర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్  ప్ర‌స‌న్న వెంక‌టేష్, జాయింట్ క‌లెక్ట‌ర్ శివ‌శంక‌ర్‌‌లతో క‌ల‌సి సిటిజన్‌ అవుట్‌ రీచ్ కార్య‌క్ర‌మం ప్రారంభించారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించిన మంత్రి స్థానికుల‌ను, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై వారి అభిప్రాయ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ సీజన్లలో జాగ్రత్త.. కరోనా మార్గదర్శకాలు పొడిగింపు.. కేంద్రం