సినీ అభిమానులకు పాత రోజులు వచ్చేశాయ్. థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం కానుంది.
అయితే గత ఏడాది మాదిరిగానే బిగ్ బాస్ షోకి ఈసారి కూడా కరోనా సెగ తాకింది. బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్‌లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈసారి చాలా కొత్తగా బిగ్ బాస్-5 షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట.