ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ గురించి ఒక్కో వీఐపీ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ప్రయోగకేంద్రం నుంచి పుట్టిందని చాల మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇంకొందరు మాత్రం మరోలా స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొవిడ్-19పై అసోం మంత్రి చంద్ర మోహన్ పటవరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పరిస్ధితికి దేవుడే కారణమన్నారు. భగవంతుడి సూపర్ కంప్యూటర్ కొవిడ్-19 వైరస్‌ను భూమి మీదకు పంపిందని, ఇందులో మానవ ప్రమేయం ఏమీ లేదని అన్నాడు. కరోనా ఎవరికి సోకాలి.. ఎవరికి రాకూడడు.. ఈ భూమిపై ఎవరికి నూకలు చెల్లాయనేది ప్రకృతే నిర్ణయించిందని పేర్కొన్నాడు.
రెండు శాతం మరణాల రేటుతో కంప్యూటర్ కొవిడ్-19ను భూమిపైకి పంపాలని నిర్ణయించిందని చెప్పుకొచ్చాడు. ఇక అసోంలో తాజాగా 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.75 శాతంగా నమోదైందని అధికారులు వెల్లడించారు.